: బెంగళూరులో దారుణం.. నడిరోడ్డుపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం రేపుతోంది. కత్తులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే సంఘ్ కార్యకర్తను పొడిచారు. దాడిలో మృతి చెందిన వ్యక్తి పేరు రుద్రేష్(35)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రుద్రేష్ ఓ సమావేశంలో పాల్గొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో కమర్షియల్‌స్ట్రీట్ సమీపంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. దాడి చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనను గురించి తెలుసుకున్న తాము ఘటనా స్థలానికి చేరుకొని రుద్రేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పో్లీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.