: నేను చెప్పిందొకటి, మీడియా రాసిందొకటి: అచ్చెన్నాయుడు


ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ, మ్యానిఫెస్టో ప్రధానాంశాల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై తాను చెప్పిందొకటైతే, మీడియా దాన్ని వక్రీకరించి మరొకటి రాసిందని ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, నిరుద్యోగ భృతిని ఇవ్వలేమని తాను చెప్పినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. నిరుద్యోగులకు నెలసరి భత్యం ఇచ్చే విషయంలో తాము అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య విషయమై సరైన అంచనాలు లేవని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. చంద్రన్న బీమా పథకం ద్వారా 2 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందులో లక్షలాది మంది నిరుద్యోగులూ భాగమయ్యారని అచ్చెన్నాయుడు వివరించారు.

  • Loading...

More Telugu News