: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ఊరికే వదిలిపెట్టబోను!: గాయకుడు అభిజిత్ భట్టాచార్య
గతేడాది డిసెంబరులో అకస్మాత్తుగా పాక్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటివరకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదంటూ, అదే సమయంలో ప్రారంభమైన కరణ్ జొహార్ 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను అడ్డుకోవడం ఎందుకంటూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన ట్వీట్‌పై విమర్శలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ఈ అంశంపై స్పందిస్తూ, కశ్యప్ ను ఊరికే వదిలిపెట్టబోనని అన్నారు. కశ్యప్‌కి ఎంత ధైర్యం? అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ నటీనటుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తావా? అంటూ ట్వీట్ చేశారు. కశ్యప్ అథమస్థాయికి పడిపోతాడని ఆయన పేర్కొన్నారు. పాక్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టబోమని అన్నారు.