: న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ఊపిరులూదిన టిమ్ సౌతీ


న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు స్టార్ బౌలర్ టిమ్ సౌతీ ఊపిరులూదాడు. 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌతీ సరిగ్గా పది ఓవర్లపాటు క్రీజులో నిలిచాడు. క్రీజులో ఉన్నంత సేపూ బౌలర్ ఉమేష్ యాదవా? బుమ్రానా?, అక్షర్ పటేలా?, అమిత్ మిశ్రానా అన్నది చూళ్లేదు. బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఒక దశలో కివీస్ కనీసం 150 పరుగులైనా సాధిస్తుందా? అన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు రికార్డు భాగస్వామ్యంతో వ్యక్తిగత రికార్డు నెలకొల్పి అర్ధ సెంచరీ సాధించాడు. 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసిన సౌతీ న్యూజిలాండ్ జట్టులో పదో నెంబర్ ఆటగాడిగా అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అమిత్ మిశ్రా వేసిన తెలివైన బంతిని బౌండరీ లైన్ దాటించే క్రమంలో మనీష్ పాండే చేతికి చిక్కి 177 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 9 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 177 పరుగులు చేసింది. ఓపెనర్ లాంతమ్ కు చివరి బ్యాట్స్ మన్ అండగా ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News