: 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్...టెయిలెండర్లపైనే భారం
న్యూజిలాండ్ జట్టుకు భారత సిరీస్ అస్సలు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. అత్యంత ప్రతిభావంతులతో కూడిన కివీస్ ప్రతి టోర్నీలోనూ అండర్ డాగ్ గా బరిలో దిగుతుంది. ప్రతి జట్టును మట్టికరిపించడంలో కివీస్ ఆటగాళ్లను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి కివీస్ జట్టు భారత్ తో సిరీస్ ప్రారంభం నుంచి ఏమాత్రం ఆటరానట్టు ఆడుతోంది. టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవ్వడంతో ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. టెస్టు సిరీస్ లో వైట్ వాష్ అయిన కివీస్ జట్టు ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో పేలవమైన ఆటతీరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో కేవలం 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కివీస్ ఆటగాళ్లలో ఒక ఎండ్ లో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ లాంతమ్ (36) ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. మరో ఓపెనర్ గుప్తిల్ (12) విఫలం కావడంతో న్యూజిలాండ్ పతనం ప్రారంభమైంది. టేలర్, రోంకీ, సాంటనర్ డక్ అవుట్ లు కావడం విశేషం. నసీమ్ షా (10), విలియమ్సన్ (3), ఆండర్సన్ (4) విఫలం కావడంతో, క్రీజులో లాంతమ్ కు జతగా బ్రాస్ వెల్ (5) ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 25 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్డిక్ పాండ్య మూడు వికెట్లతో రాణించగా, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ చెరి రెండు వికెట్లు తీశారు.