: ఎయిర్ పోర్టులో ఆపిన అధికారులకు ఝలక్ ఇచ్చి విదేశాలకు చెక్కేసిన మయిన్ ఖురేషి


మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుంది. విషయం ఇమిగ్రేషన్ అధికారులు పసిగట్టారు. దేశం దాటి వెళుతున్న నిందితుడిని అడ్డుకున్నారు కూడా. ఆపై అధికారులకు ఝలక్ ఇచ్చిన నిందితుడు దుబాయ్ విమానం ఎక్కుతుంటే చూస్తూ వీడ్కోలు పలికారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన వివరాల్లోకి వెళితే, మాంసం ఎగుమతి చేసే వ్యాపారి మొయిన్ ఖురేషి పై ఈడీ లుకౌట్ నోటీసులు ఉన్నాయి. వీటి ఆధారంగా ఎయిర్ పోర్టులో ఆయన ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోగా, ఓ కోర్టు తాను విదేశాలకు వెళ్లడానికి అనుమతించిన పత్రాన్ని చూపించాడు. తాను వెళ్లవచ్చని వాదించి దర్జాగా విమానం ఎక్కి వెళ్లిపోయాడు. అతను ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఈడీ అధికారులు వెళ్లేసరికే జారుకున్నాడు. కోర్టు ఉత్తర్వులు పరిశీలించిన అధికారులకు తెలిసిందేమంటే, అది మనీ ల్యాండరింగ్ కేసుది కాదు. ఆదాయపు పన్ను కేసులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుగా తేలింది. తెలిసి మరీ నిందితుడిని విమానం ఎక్కించిన ఇమిగ్రేషన్ అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News