: మోదీ సూట్లు ధరించిన బ్రిక్స్ దేశాధినేతలు
బ్రిక్స్ దేశాధినేతలంతా గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా వారు ధరించిన దుస్తులు చూసి అంతా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే, వారంతా నరేంద్ర మోదీని అనుకరించారు. మోదీ సూట్ ధరించిన బ్రిక్స్ దేశాధినేతలతో దిగిన ఫోటోను మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ టెమెర్ లతో దిగిన ఫోటో కు 'మై బ్రిక్స్ ఫ్యామిలీ' అంటూ మోదీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.