: చిల్లర దొంగ మల్లేష్ చిన్నారి ఇందూశ్రీపై లైంగికదాడికి యత్నంచి గొంతుకోసి హత్య చేశాడు: పోలీసులు


మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో సంచలనం సృష్టించిన చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యుల హస్తం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం వారి నివాసంలో గొడవ జరిగిందని, కుటుంబంలో కలతలవల్లే వారింట్లో వాళ్లే చిన్నారిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దానికి తోడు, స్నిఫర్ డాగ్ కూడా లక్ష్మీ ప్రసన్న తాత రామారావు వద్దకు వెళ్లి ఆగడం, తరువాత ఆమె పిన్ని వెంకటలక్ష్మిపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు కృష్ణమూర్తి, భవానీ, తాత రామారావు, పిన్ని వెంకటలక్ష్మిల హస్తం లేదని స్పష్టం చేశారు. చిల్లర దొంగతనాలు చేసే మల్లేష్ ఈ ఘాతుకానికి ఒడిగనట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 12న చిన్నారి తల్లిదండ్రులు విధులకు వెల్లిన అనంతరం, తాత రామారావు వచ్చి భోజనం చేశాడు. ఆయన ఆడుకుంటున్న మనవరాళ్లను పిలిచి భోజనం పెట్టి నిద్రపొమ్మని చెప్పి తన పనికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమె సోదరి నిద్రపోతుండడంతో అలికిడి అయిన ప్రసన్న నిద్రలేచి చూసింది. ఆ సమయంలో, చోరీ చేసేందుకు వారి ఇంటికి సమీపంలోనే ఉండే మల్లేష్ అని చిల్లరదొంగైన బాలుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అతనిని ప్రసన్న అడ్డుకోవడంతో ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో, భయాందోళనలకు గురైన బాలిక ఏడుస్తూ, తన తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. దీంతో, తన పేరు బయటపడుతుందేమో అని భావించిన ఆ బాలుడు ప్రసన్నపై బ్లేడుతో దాడి చేసి, పరారయ్యాడు. తర్వాత చిన్నారి గొంతు, మణికట్టుపై తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో ఆమెను చూసిన పిన్ని ఆందోళనతో ఆసుపత్రికి తీసుకెళ్లిందని, బాలిక చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. రెండు రోజులపాటు ఈమాత్రం క్లూలు దొరకని ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు తమ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని వారు తెలిపారు. ఎట్టకేలకు సెలఫోన్ సిగ్నల్స్ సాయంతో దొంగను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాలిక కుటుంబ సభ్యులను అనుమానించడం తమ పొరపాటని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News