: ఉగ్రమూకలను వేటాడాల్సిందే... పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా వార్నింగ్ ఇచ్చింది. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం మానుకోవాలంటూ మరోసారి సూచించింది. ఉగ్రమూకలను వేటాడాల్సిందే అంటూ తేల్చి చెప్పింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామం అనే అపకీర్తిని చెరిపేసుకోవాలని సూచించింది. పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులను అమెరికా ఇప్పటికే సమర్థించిన సంగతి తెలిసిందే. స్వీయ భద్రత కోసం దాడులు జరపడం తప్పేం కాదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాక్ లకు సూచించింది.