: గోవా చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది సేపటి క్రితం దాబోలిమ్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న ఐఎన్ఎస్ హన్సా బేస్కు చేరుకున్నారు. ఆయనకు పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు ఐఎన్ఎస్ హన్సా బేస్కు రాత్రి 1 గంటలకే చేరుకోవాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో ఆయన రాక ఆలస్యమయింది. పుతిన్ అక్కడి నుంచి గోవా బ్రిక్స్ సదస్సు ప్రాంగణానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కూడా చర్చించనున్నారు.