: భారత్ చేరుకున్న బ్రెజిల్, సౌతాఫ్రికా దేశాల అధ్య‌క్షులు


గోవాలో నేడు, రేపు జ‌రగ‌నున్న‌ బ్రిక్స్ సమాఖ్య (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు కోసం ఆయా దేశాల అధ్య‌క్షులు భార‌త్‌కు చేరుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం బ్రెజిల్ అధ్య‌క్షుడు మైఖేల్ టీమ‌ర్‌, సౌతాఫ్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమాలు గోవా విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. సౌతాఫ్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమాకు విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి జ‌న‌ర‌ల్ వీకే సింగ్ ఎయిర్‌పోర్టులో స్వాగ‌తం ప‌లికారు. మ‌రోవైపు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌, చైనా అధ్య‌క్షుడు జీ జింగ్‌పింగ్ కూడా మ‌రికాసేప‌ట్లో గోవా చేరుకోనున్న‌ట్లు తెలుస్తోంది. స‌ద‌స్సులో ప్ర‌ధానంగా ఉగ్ర‌వాదంపై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. పాకిస్థాన్ ఉగ్ర‌వాదం అంశాన్ని భారత్ లేవ‌నెత్తే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News