: 'ఐయామ్ ఏ బిచ్' అంటున్న శ్రుతిహాసన్... వీడియో వైరల్


యూట్యూబ్ ఛానల్ 'బ్లష్'లో 'బీ ది బిచ్' పేరుతో ప్రముఖ సినీ నటి శ్రుతిహాసన్ ఓ వీడియోను విడుదల చేసింది. అన్ బ్లష్డ్ సిరీస్ లో భాగంగా ఈ వీడియోను నెటిజన్ల ముందుకు ఆమె తీసుకొచ్చింది. ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ హిట్స్ వచ్చాయి. మరోవైపు, దక్షిణాది నటీనటులంతా శ్రుతి వీడియోకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇప్పటి దాకా ఈ సిరిస్ కింద కల్కి కొచ్చిన్, నిమ్రత్ కౌర్ రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు, అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే గళం విప్పారు. సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించడానికి శ్రుతిహాసన్ ఈ వీడియోను రూపొందించింది. "బిచ్... చాలా మంది జీనియస్ మమ్మల్ని ఇలా సంబోధిస్తారు. మీకు స్థానం లేక, ఆ పదంతో మా స్థానాన్ని నిర్ధారిస్తారు... బిచ్ అంటే మల్టీ టాస్కర్... బిచ్ ఓ ఉపాధ్యాయురాలు... వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది... హార్మోన్లతో నిండిన అమ్మాయి బిచ్... ఇన్ దట్ వే 'ఎస్' ఐయామ్ ఏ బిచ్..." అంటూ ఈ వీడియో సాగుతుంది.

  • Loading...

More Telugu News