: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మరో 2 శాతం భత్యం పెంచుతూ సర్కారు నిర్ణయం?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తే. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల భత్యాలను పెంచుతూ ఒకటి రెండు వారాల్లో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం నోటిఫికేషన్ జారీ అయితే సవరించిన భత్యాలు ఉద్యోగులకు దీపావళి నుంచే అమల్లోకి వస్తాయి. వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెండు శాతం వరకు భత్యాలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పెన్షనర్లకు కూడా సవరించిన భత్యాలు వర్తిస్తాయి. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసా నేతృత్వంలోని భత్యాల కమిటీ త్వరలో ఆర్థిక మంత్రికి నివేదిక సమర్పించనుంది. పెరిగిన భత్యాలు ఈనెల లేదంటే వచ్చే నెల జీతాల్లో కలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News