: నల్గొండ జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు కట్టంగూరు మండలం అయిటిపాముల శివారులోని చెరువు అన్నారం వద్ద అదుపు తప్పి వంతెన పైనుంచి కాల్వలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు, మరో యవకుడు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.