: తెలంగాణలో ఏ గ్రేడ్ ధాన్యం 1,510/-, సాధారణ రకం ధాన్యం 1,470/-


తెలంగాణ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో రానున్న మార్కెటింగ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి 1,510 రూపాయలు మద్దతుధరగా చెల్లించనున్నారు. సాధారణ రకం క్వింటాల్ ధాన్యానికి 1,470 రూపాయలు చెల్లించనున్నారు. ఏకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News