: పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రూపా గంగూలీ


దశాబ్దాల క్రితం దూరదర్శన్ లో వచ్చిన 'మహాభారత్' టీవీ సీరియల్ ద్వారా ద్రౌపదిగా పరిచయమైన బెంగాలీ నటి రూపా గంగూలీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన నామినేటెడ్ ఎంపీ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ స్థానంలో ఆమెను నియమించిన సంగతి విదితమే. బెంగాల్ నుంచి వచ్చిన తాను మహిళల కోసం పని చేయాల్సిన గురుతర బాధ్యతను మర్చిపోనని ఆమె తెలిపారు. అలాగే రాజ్యసభ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తానని ఆమె తెలిపారు. ఆమెతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత గణేశన్ మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ హమీద్ ఆన్సారీ ప్రమాణస్వీకారం చేయించారు.

  • Loading...

More Telugu News