: చిరంజీవి కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ కు రెండో పెళ్లి!


కొన్నేళ్ల కిందట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆర్యసమాజ్ లో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం అప్పట్లో పెను సంచలనమే కలిగించింది. కొంతకాలం కాపురం తరువాత ఓ బిడ్డను కనడం, ఆపై విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని శ్రీజ మరొకరిని వివాహం చేసుకోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు తన జీవితంలోకి శిరీష్ మరో యువతికి ఆహ్వానం పలకబోతున్నాడు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ఆయన వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ వివాహం గ్రాండ్ గా జరుగుతుందని సమాచారం. ఇప్పటికే బీజేపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శిరీష్, శ్రీజ కుటుంబానికి షాకిచ్చేలా పెళ్లి చేసుకోబోతున్నాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News