: చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు చూపిస్తూ, నిప్పులు చెరిగిన రోజా


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తన పదునైన విమర్శలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు వైకాపా ఎమ్మెల్యే రోజా. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, గతంలో చంద్రబాబు వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ చూపించారు. "నేను, వెంకయ్యనాయుడు అవకాశం లభిస్తే, అమెరికాలో పుట్టుండే వాళ్లం" అన్న బాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, నిప్పులు చెరిగారు. తాను ఆంధ్రప్రదేశ్ లో పుట్టుండాల్సిన వాడిని కాదని స్వయంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఉండటం దౌర్భాగ్యమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో తన తండ్రి కర్జూరపు నాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ, రాజకీయ భిక్ష పెట్టిన కుప్పం, తన ప్రాణాలు నిలిపిన వెంకటేశ్వరుడు ఆయనకు గుర్తుకు రాలేదని, వెంకయ్యనాయుడు మాత్రమే ఆయనకు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, వెంకయ్యలు అవిభక్త కవలల వంటి వారని, వారిద్దరి మధ్యా ఎన్నో లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయని రోజా ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. అమెరికాకు వెళ్లినా ఇద్దరూ కలిసే వుండాలని అనుకుంటున్నారంటే, ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు కోటీశ్వరుడి కుటుంబం నుంచి రాలేదని, రెండెకరాల నుంచి వచ్చానన్న విషయాన్ని మరచి మురికివాడల్లో నివసించే ప్రజలను అవమానించారని చెబుతూ, 'మురికి వాడల నుంచి వస్తే మురికి ఆలోచనలే వస్తాయి' అన్న బాబు వ్యాఖ్యలను మీడియాకు మరోసారి చూపారు. అంత అహంకారం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News