: పిల్లి గ‌డ్డం, పిచ్చి గ‌డ్డం ఉంటే చాలు వారు గొప్పవారని చంద్ర‌బాబు అనుకుంటున్నారు: రోజా


పిల్లి గ‌డ్డం, పిచ్చి గ‌డ్డం ఉంటే చాలు, వారు గొప్పవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. స్వదేశీ ఇంజ‌నీర్ల‌ను కాదంటూ సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణాలు అప్పజెప్పారని ఆమె విమర్శించారు. మరోవైపు ప్రపంచం మొత్తం రష్యాతో ఒప్పందాలు వ‌ద్ద‌నుకుంటుంటే, చంద్ర‌బాబు మాత్రం ర‌ష్యాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నార‌ని ఆమె అన్నారు. ‘చంద్ర‌బాబు ఎక‌న‌మిక్స్‌లో పీహెచ్‌డీ చేశాన‌ని చెప్పుకుంటున్నారు. పీహెచ్‌డీకి అప్లికేష‌న్ పెట్టుకున్నంత మాత్రాన పీహెచ్‌డీ అయిపోరు. భార‌తీయుల‌ను అవ‌మానించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. ఇండియ‌న్లు, ఏపీ వారు గాడిద‌లు, సింగ‌పూర్ వారు గుర్రాలు అని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉంటూ మ‌న ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు ఇంత‌గా కించ‌ప‌రుస్తున్నారు. చంద్ర‌బాబుకి అంత అహంకారం ఎందుకు? ఆయన మ‌ళ్లీ అధికారంలోకి రారు. భార‌త‌దేశాన్ని అవ‌మానిస్తున్నారు. భ‌ర‌త మాత‌ కాళ్లు ప‌ట్టుకొని చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు అడ‌గాలి. చంద్ర‌బాబు త‌న అవినీతి కార్య‌క్ర‌మాల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌ప‌డానికి ధైర్యం ఉందా..? మీ ద‌గ్గ‌ర ఉన్నది న‌ల్ల‌ధ‌న‌మా? తెల్ల‌ధ‌న‌మా? చెప్పాలి. బ్లాక్ మ‌నీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ చంద్ర‌బాబు. అటువంటి వ్య‌క్తి నల్ల‌ధ‌నంపై మాట్లాడుతున్నారు’ అని రోజా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News