: మరో పోరాటానికి సిద్ధం.. వచ్చే నెల 16 నుంచి ముద్రగడ కాపు సత్యాగ్రహ యాత్ర


కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోన్న మాజీ మంత్రి, కాపు ఐక్య వేదిక‌ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రో ఉద్య‌మానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్ర‌భుత్వం కాపుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్న ముద్ర‌గ‌డ వ‌చ్చేనెల 16 నుంచి కాపు స‌త్యాగ్ర‌హం పేరిట యాత్రను చేపట్టనున్నారు. ఈ యాత్ర తూర్పు గోవాద‌రి జిల్లా రావులపాలెంలో ప్రారంభమై అక్కడి నుంచి అమ‌లాపురం మీదుగా అంత‌ర్వేది వర‌కు ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత త‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News