: భారత్ సర్జికల్ దాడులను సమర్థించిన అమెరికా


పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం ఇటీవల చేపట్టిన సర్జికల్ దాడులను అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది. ఆత్మరక్షణ కోసమే భారత్ దాడులు నిర్వహించిందని... ఇందులో తప్పుపట్టాల్సినదేమీ లేదని పేర్కొంది. ఉరీ ఘటన ఉగ్రవాదమేనని... ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం సరికాదని కూడా అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్ఎస్జీ గ్రూపులో భారత్ ను చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇండియాలు కలసే పనిచేస్తాయని చెప్పింది.

  • Loading...

More Telugu News