: ఇస్లామాబాద్ లో స్పెయిన్ దౌత్యవేత్త ఆత్మహత్య
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో స్పెయిన్ దౌత్యవేత్త జాన్ జెన్నెర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని తన నివాసంలో ఆయన శవమై కనిపించారు. ఇంటికి లోపలవైపు నుంచి గడియ వేసి ఉంది. మృతదేహం పక్కనే తుపాకీ ఉంది. దీంతో, జాన్ జెన్నెర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. గత 34 ఏళ్లుగా ఆయన ఇస్లామాబాద్ లోనే నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారన్న విషయం తెలియరాలేదు.