: 'ఇండియాలోకి దూసుకెళ్లేందుకు అనుమతించండి' అన్న మసూద్ వ్యాఖ్యలపై పాక్ ప్రజల తీవ్ర ఆగ్రహావేశం


తమకు అనుమతి ఇస్తే, జీహాదీలను తీసుకెళ్లి, భారత్ లోకి చొరబడి, కాశ్మీర్ ను బహుమతిగా తెచ్చి పాకిస్థాన్ లో కలిపేస్తామని జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. పలు పత్రికలు మసూద్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ఉగ్రవాదుల విషయంలో పాక్ ఇప్పటికే ఏకాకిగా మారిందన్న సంకేతాలు వస్తున్న సమయంలో మసూద్ మాటలు దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసేవేనని పాక్ నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం పాక్ లో మసూద్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోవైపు మసూద్, హఫీజ్ లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారన్న ప్రశ్నలు వస్తుండటంతో పాక్ ప్రభుత్వం, సైన్యం ఇబ్బందుల్లో పడుతోంది.

  • Loading...

More Telugu News