: గెలాక్సీ నోట్ 7 ఇచ్చేస్తే, రూ. 30 వేలు అదనపు లాభం... శాంసంగ్ సూపర్ ఆఫర్ తో దూసుకెళ్లిన షేర్లు


గెలాక్సీ నోట్ 7, నోట్ 7 ఎస్ ల కారణంగా వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకుని తిరిగి తలెత్తుకుని నిలబడేందుకు శాంసంగ్ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే ఫోన్ల రీప్లేస్ మెంట్ ను ప్రకటించిన సంస్థ 880 డాలర్లు (సుమారు రూ. 60 వేలు) విలువైన గెలాక్సీ నోట్ 7 ఎస్ ను వాపస్ చేసిన కస్టమర్లకు 440 డాలర్లు (సుమారు రూ. 30 వేలు) విలువైన కూపన్ ఇస్తామని తెలిపింది. ఇదే సమయంలో సంస్థ మార్కెటింగ్ చేస్తున్న మరో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 70 వేలు మొబైల్ క్రెడిట్ రూపంలో ఇస్తామని పేర్కొంది. తమ కస్టమర్లకు కలిగిన అసౌకర్యాన్ని ఈ విధంగా దూరం చేయాలని శాంసంగ్ గురువారం నాడు ఓ ప్రకటనలో తెలుపగా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. ఇటీవలి కాలంలో భారీగా నష్టపోతూ వచ్చిన సంస్థ ఈక్విటీ విలువ నేడు 2.4 శాతానికి పైగా లాభపడింది.

  • Loading...

More Telugu News