: హాస్పిటల్ లో పేపర్లు చదువుతున్న జయలలిత!.. పార్టీ వర్గాల వెల్లడి!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆమె ఆరోగ్యంపై సర్వత్రా సంశయం నెలకొన్న నేపథ్యంలో, అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. జయలలిత చాలా త్వరగా కోలుకుంటున్నారని... ప్రస్తుతం ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఈ విషయాన్ని తమకు వైద్యులు వెల్లడించారని చెప్పారు. మీరు నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించాలని నోట్ పంపగానే... ఆమె 'సరే' అని అన్నారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్పృహలోనే ఉన్నారని... కాకపోతే, ఇన్ఫెక్షన్ల కారణంగా ఇతరులెవరినీ వైద్యులు లోపలకు అనుమతించడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News