: రాయితీతో ప్రయాణం, స్వాగత సత్కారాలతో అరగంటలో స్వామి దర్శనం: సామాన్యుల కోసం టీటీడీ కొత్త ప్రణాళిక


కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని రెప్పపాటు కాలం దర్శించుకునేందుకు సామాన్యులు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి చూస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏటా దాదాపు 1.30 లక్షల మంది సామాన్యులకు మరింత సులువుగా దర్శనం కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పేదలకు రాయితీతో కూడిన టికెట్ పై తిరుమలకు ప్రయాణం, ఆపై క్యూలైన్లోకి వెళ్లిన అరగంటలో దర్శనం లభిస్తుంది. వీరికి అధికారులు దగ్గరుండి దర్శనం చేయించడంతో పాటు, డిప్యూటీ ఈఓ స్వయంగా ప్రసాదాలను అందిస్తారు. ఇందుకోసం 'దివ్యదర్శనం' పేరిట కొత్త పథకం అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. వీఐపీలకు దక్కే సౌకర్యాలను సామాన్యులకూ అందించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేస్తుండగా, దేవాదాయ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

  • Loading...

More Telugu News