: ఒలింపిక్ విజేత పీవీ సింధుకు ‘తానా’ సత్కారం
ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధును ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి బుధవారం హైదరాబాద్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింధు భవిష్యత్తులో బంగారం పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించేందుకు ‘తానా’ అండగా ఉంటుందని తెలిపారు. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించి తెలుగు ప్రజలకు, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఎంతోమందిలో ఆమె స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.