: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిన్న దసరా పండుగ అయితే నేడు అమరావతి పండుగ!: ఎంపీ మురళీ మోహన్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిన్న (మంగళవారం) దసరా పండుగ అయితే, ఈ రోజు అమరావతి పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు. బాబు ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని అభిప్రాయపడ్డ ఆయన, పాలన బాగుందని కితాబునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడుందన్నది అప్రస్తుతమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. లొకేషన్ల కొరతతోనే విదేశాల్లో చిత్రీకరణ జరపాల్సి వస్తోందని ఆయన తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News