: చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన అరుణ్ జైట్లీ, అమిత్ షా
చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించడానికి ఈరోజు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. అయితే, వైద్యులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఈ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, అమిత్ షా ట్విట్టర్ ద్వారా మాత్రం స్పందించారు. జయలలిత ఆరోగ్యం గురించి తాను వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.