: జమ్ముకశ్మీర్ పాంపోర్‌లో ముగిసిన ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్ లోని పాంపోర్‌లో సైన్యం జరుపుతున్న ఎదురుకాల్పులు ముగిశాయి. అక్కడి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) భవనంలోకి రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే. నిన్న ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాబలగాలు ఈరోజు మరో ఉగ్రవాదిని హతమార్చాయి. మొత్తం 60 గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనంతరం కాల్పులు ముగిశాయని ప్రకటించాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.