: సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మోదీదే!: రక్షణ మంత్రి పారికర్


పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి ఇండియన్ ఆర్మీ దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మోదీదేనని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడి జరిగిన అనంతరం సైనికులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. దీంతో నిఘా వర్గాల సమాచారంతో ప్రణాళికలు రచించారు. ప్రాణాలకు తెగించి, శత్రుదేశంలో అడుగుపెట్టారు. ముష్కరులను విజయవంతంగా మట్టుబెట్టి చాకచక్యంగా భారత్ లో అడుగుపెట్టారు. ఇక ఈ మొత్తం క్రెడిట్ ను మోదీ తన ప్రచార ఖాతాలో వేసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన మెటీరియల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఎంఇటి) సదస్సులో మంత్రి పారికర్ మాట్లాడుతూ, సర్జికల్ స్ట్రయిక్స్ కు అనుమతించడం ద్వారా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన లక్షితదాడుల క్రెడిట్ లో సింహభాగం మోదీకే చెందుతుందని అన్నారు. ఆయన ఆదేశాలు పాటించడమే తన పని అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News