: ఈ 13 మందిలో సల్మాన్ షోలో ఎంటర్ అయ్యేది ఎవరో!


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే రియాల్టీ షో 'బిగ్ బాస్' చాలా పాప్యులర్ అయింది. మన దేశంలోనే కాక అనేక దేశాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు ఈ షోలో కేవలం సెలబ్రిటీలు, పేరు ప్రఖ్యాతులు గల వారు మాత్రమే పాల్గొన్నారు. కానీ, రానున్న సీజన్ 10లో మాత్రం సామాన్య ప్రజలు కూడా పాల్గొనబోతున్నారు. ఆడిషన్స్ ద్వారా 13 మందిని ఫైనల్స్ కి ఎంపిక చేశారు. వీరిలో కేవలం 8 మంది మాత్రమే చివరకు హౌస్ లోకి అడుగు పెడతారు. ఫైనల్స్ కు చేరిన 13 మంది ఎవరో, వారు ఏం చేస్తారో ఓ సారి చూద్దాం. 1. దేవ్ దేవగణ్... 30 ఏళ్ల దేవ్ లుథియానాకు చెందిన బిజినెస్ మేన్. 2. ఫిరోజ్ ఖాన్... 27 ఏళ్ల ఇతడికి అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. 3. కాజోల్ త్యాగి... 23 ఏళ్ల ఈ అమ్మాయి మంచి డ్యాన్సర్. 4. లోకేష్ కుమారి శర్మ... 25 ఏళ్ల ఈమె ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. డ్యాన్స్, ట్రావెల్, పాటలు పాడటం అంటే ఇష్టం. జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలనేది ఈమె అభిమతం. 5. మందిరా చౌహాన్... పూణెలో రేడియో జాకీగా పని చేస్తోంది. రోడ్ ట్రిప్స్, పార్టీలంటే ఇష్టం. 6. మనోజ్ పంజాబీ... బిజినెస్ మేన్. 7. మన్వీర్ గుర్జార్... ఓ డైరీ ఫామ్ ఓనర్. 29 ఏళ్ల మన్వీర్ కు కబడ్డీ, రెజ్లింగ్ అంటే ఇష్టం. 8. నవీన్ ప్రకాశ్... 26 ఏళ్ల ఇతను టీచర్ గా పని చేస్తున్నాడు. బిహార్ నుంచి వచ్చిన ఇతనికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం హాబీ. 9. నిఖిల్ మెహతా... ఈ ముంబై వాలా యాక్టర్ మరియు సింగర్. 10. నితిభ కౌల్... ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు అకౌంట్ స్ట్రాటజిస్ట్. డ్యాన్సింగ్, మ్యూజిక్, రీడింగ్, సింగింగ్, స్విమ్మింగ్ అంటే ఈమెకు చాలా ఇష్టం. 11. ప్రమోద్ దహియా... యాక్టర్, రైటర్ అయిన దహియాకు ఆటలంటే చాలా ఇష్టం. హర్యాణాకు చెందిన ఈయన ముంబైలో నివసిస్తున్నాడు. 12. ప్రియాంక జగ్గా... ఢిల్లీలో మార్కెటింగ్ రిక్రూటర్. బ్యాడ్మింటన్, ట్రావెలింగ్ అంటే ఇష్టం. 13. రుచిక సింగ్... 39 ఏళ్ల ఈ భామకు పార్టీలంటే మహా ఇష్టం. బిగ్ బాస్ చరిత్రలో సాధారణ వ్యక్తులతో కలసి సెలబ్రిటీలు పోటీ పడటం ఇదే తొలిసారి. అక్టోబర్ 10న బిగ్ బాస్-10 ప్రీమియర్స్ ప్రారంభమవుతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కు సల్మాన్ తో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కో-హోస్ట్ గా వ్యవహరించనుంది.

  • Loading...

More Telugu News