: పొద్దున్నే ఆఫీస్ కు రాగానే బాస్ దగ్గర క్యూ కట్టాల్సిందే... వీడియోను మీరూ చూడండి


ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లగానే ఎవరైనా ఏం చేస్తారు? బాస్ కనిపిస్తే, గుడ్ మార్నింగ్ చెబుతారు. సహోద్యోగులకు హాయ్ చెప్పి పనుల్లో నిమగ్నమవుతారు. కానీ, చైనాలోని టాంగ్‌ జ్యు జిల్లాలో ఉన్న ఈ కంపెనీలో పనిచేయాలంటే మాత్రం అమ్మాయిలు బాస్ తో ప్రతిరోజూ పెదవులు కలపాల్సిందే. ఉదయం ఆఫీస్ కు రాగానే బాస్ ముందు క్యూ కట్టి కిస్ చేయాలి. లేకుంటే రిజైన్ చేయాల్సిందే. పొద్దున్నే 9 నుంచి 9:30 గంటల మధ్య తమ బాస్ కు ముద్దులు పెట్టేందుకు లేడీ ఎంప్లాయిస్ క్యూ కడితే, దాన్ని ఎవరో వీడియో తీసి మీడియాకు అందించారు. ఇలా ముద్దులు పెట్టలేమన్న పాపానికి గతంలో కొందరు రిజైన్ చేసి కూడా వెళ్లిపోయారట. ఇప్పుడీ వ్యవహారాన్ని 'పీపుల్స్ డైలీ' బట్టబయలు చేయగా, ఆ బాస్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ముద్దుల వీడియోను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News