: కరీంనగర్‌లో ఉరివేసుకొని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌.. మృత‌దేహంతో పోలీస్‌స్టేష‌న్‌కు బ‌య‌లుదేరిన గ్రామస్తులు


కరీంనగర్ జిల్లా మాన‌కొండూరులో ఓ యువ‌కుడు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ద‌స‌రా ఉత్స‌వాల సందర్భంగా ఆ ప్రాంతంలోని ప‌లువురు యువ‌కులు నిన్న పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీస్‌స్టేష‌న్‌కి తీసుకెళ్లి హెచ్చ‌రించి వ‌దిలివేశారు. అయితే, మ‌రోసారి పోలీస్‌స్టేష‌న్‌కు రావాల‌ని ఐదుగురు యువ‌కుల‌ను పోలీసులు ఆదేశించారు. దీంతో తీవ్ర‌ మ‌న‌స్తాపం చెందిన శ్రావ‌ణ్‌(23) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ్రామ‌స్తులు ఆ యువ‌కుడి మృత‌దేహంతో మాన‌కొండూరు పోలీస్‌స్టేష‌న్‌కు బ‌య‌లుదేరారు.

  • Loading...

More Telugu News