: జయలలిత శాఖలన్నీ పన్నీర్ సెల్వంకు అప్పగింత... ఆమె సలహాపైనే!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురికావడంతో ఆమె వద్ద వున్న శాఖలను తాత్కాలికంగా పన్నీర్ సెల్వంకు బదలాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమెకు లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆసుపత్రిలో చేరి నేటికి 21 రోజులు అయింది. మరికొంత కాలం పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి తిరిగి విధులలో చేర వరకు ఆమె శాఖలను పన్నీర్ సెల్వం నిర్వహిస్తారని, ముఖ్యమంత్రి సలహాపైనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ముఖ్యమంత్రిగా జయలలిత కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News