: మోదీ ఉన్నంత కాలం రెండు దేశాల మధ్య బంధం ఇలాగే ఉంటుంది: సర్తాజ్ అజీజ్
యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ 'రేడియో పాకిస్థాన్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంత కాలం రెండు దేశాల మధ్య సఖ్యత నెలకొనదని అన్నారు. దక్షిణ ఆసియాలో శాంతి విలసిల్లాలంటే భారత్-పాకిస్థాన్ భాయిభాయిలా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భాయిభాయిలా ఉండేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన తెలిపారు. అదే సమయంలో కశ్మీర్ అంశం విషయంలో తమ విధానం మారలేదని, కశ్మీరీల స్వాతంత్ర్య పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.