: లోకేష్ ఎదుగుతుంటే మీకెందుకు బాధ?: వైసీపీ నేతలకు దేవినేని నెహ్రూ ప్రశ్న
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ యువనేత లోకేష్‌పై వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. లోకేష్ ఎదుగుతుంటే మీకెందుకు బాధ? అని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. వ్యక్తిత్వాలను కించపరిచే విమర్శలు చేయడం సరికాదని దేవినేని నెహ్రూ అన్నారు. చంద్రబాబుపై లోకేష్ ఎదురుతిరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోకూడదని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.