: బుద్ధిలేని కాంగ్రెస్ నాయకులు మాపై అవాకులు చవాకులు పేలుతున్నారు: మంత్రి తలసాని
బుద్ధిలేని కాంగ్రెస్ నాయకులు తమపై అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో పనికిమాలిన నాయకులందరూ చేరారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆ పార్టీ నాయకులకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎన్నింటినో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, ప్రజలను కలవడం లేదంటూ సీఎంపై ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.