: దేశం కూడా పెద్దదే...విభజిద్దామా?: విభజనవాదులకు అఖిలేష్ యాదవ్ కౌంటర్


దేశం కూడా పెద్దదే...విభజిద్దామా? అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లక్నోలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కొన్ని పార్టీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెద్దగా ఉందని, అందువల్లేే పరిపాలన సరిగ్గా సాగడం లేదని ఆరోపిస్తున్నారని, ఈ నేపథ్యంలో యూపీని విభజించాలని కూడా డిమాండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 'పెద్ద రాష్ట్రమని ఈ రోజు యూపీని విభజించముంటున్నారు. రేపు దేశం పెద్దగా ఉందని దానిని విభజించమంటారు. అప్పుడు దేశాన్ని కూడా విభజిద్దామా?' అని ఆయన ప్రశ్నించారు. విభజన మంచిది కాదని, భారత సూత్రం భిన్నత్వంలో ఏకత్వమని, ఏకత్వంలో భిన్నత్వం కాదని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News