: సినిమా చూడండని అడుక్కోవడం ఆపేయ్యండి... ప్రకాష్ రాజ్ ఫేస్ బుక్ పోస్టుపై ఓ అభిమాని
తన తాజా చిత్రం 'మనఊరి రామాయణం' బాగుందని అందరూ అంటున్నా, కలెక్షన్లు మాత్రం రాకపోవడంపై ప్రకాష్ రాజ్, తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్టుపై పలువురు స్పందించారు. వాటిల్లో ఓ అభిమాని స్పందన వైరల్ అయింది. తన సినిమాను చూడాలంటూ, ప్రకాష్ రాజ్ అంతటి మంచి నటుడు అడుక్కోవడం బాధకలిగిందని రాస్తూ, తీసిన వాళ్లకు సినిమా బాగుంటుందని, సినిమా ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షకులేనని చురకలు అంటించాడు. ప్రేక్షకులకు నచ్చితే సినిమా చూసేందుకు వస్తారని, నచ్చకుంటే రారని చెబుతూ, సినిమా చూడాలని అడుక్కోవడం ఆపేయాలని సలహా ఇచ్చాడు. సినిమా తీసిన వాళ్లు దాన్ని బాగుందని చెబితే నమ్మే రోజులు పోయాయని అన్నాడు. ఇక ఈ స్పందనపై ప్రకాష్ రాజ్ ఏమంటాడో వేచి చూడాలి.