: ఆ పరిస్థితే వస్తే బుల్లెట్లు లెక్కించం.. స్పష్టం చేసిన రాజ్‌నాథ్ సింగ్


భారత్ ఎవరిపైనా దాడులకు దిగదని, ఒకవేళ ఆ పరిస్థితే వస్తే బుల్లెట్లను లెక్కించబోమని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘మేమెప్పుడూ తొలుత ఎవరిపైనా దాడులు చేయం. కానీ మాపై దాడికి దిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోం. ఓసారి ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్లను లెక్కపెట్టే పరిస్థితి ఉండదు’’ అని హెచ్చరించారు. రాజస్థాన్‌‌లో బీఎస్ఎఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మునాబావో బోర్డర్‌ను సందర్శించిన రాజ్‌నాథ్ సరిహద్దులో నిర్మాణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత, నీటి వసతి కల్పన తదితర అంశాలపై సైనికులకు భరోసా ఇచ్చారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటును పూర్తి చేయడంతో పాటు ఫెన్సింగ్‌కు సమానంగా రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రపంచమంతా ఒకే కుటుంబంగా తాము భావిస్తామని, తమకు ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న ఆశ లేదని తెగేసి చెప్పారు. అయితే తమపై ఎవరైనా దాడులకు దిగితే మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News