: ఎల్‌వోసీ వద్ద బలగాలను మోహరిస్తున్న పాక్.. చొరబాట్లకు సిద్ధంగా ఉగ్రవాదులు


నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. ఇందుకోసం ఎల్‌వోసీ వెంబడి ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. భారత సైన్యం ఇప్పటికే పంజాబ్, కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలను ఖాళీ చేయించిన విషయం విదితమే. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఎల్‌వోసీ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. దీంతో ఇప్పుడు మరోమారు ఎల్‌వోసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థల శిబిరాలను ఆర్మీ బేస్‌లలోకి తరలిస్తున్న పాక్ ఆర్మీ మరోవైపు వందమందికి పైగా ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇక పాక్ కవ్వింపు చర్యలకు ఏమాత్రం అడ్డకట్ట పడడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిరోజు ఉల్లంఘిస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 25 సార్లు పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను గాయపడ్డాడు.

  • Loading...

More Telugu News