: జాతీయ మహిళా సమావేశాలకు అమరావతి ఆతిథ్యం.. ఫిబ్రవరి తొలివారంలో నిర్వహణ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ పుణెలో శనివారం సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలోని ఎంఐటీ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సమావేశాలకు సమన్వయకర్తగా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు, మహిళా ప్రముఖులు కలిసి దాదాపు 400 మంది ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల నిర్వహణ కమిటీకి చీఫ్ ప్యాట్రన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించనున్నారు. ఎంఐటీ విద్యాసంస్థల నిర్వాహకుడు రాహుల్ కరాద్ ఆహ్వానంపై పుణె వెళ్లిన కోడెల సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పదివేలమంది చురుకైన బాలికలు, విద్యార్థినులను ఎంపిక చేసి ఈ సమావేశాలకు ఆహ్వానించనున్నట్టు తెలిపారు.