: జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల... ఫిజియో చేయిస్తున్నామని ప్రకటన!
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హెల్త్ బులెటిన్ ను చెన్నయ్ అపోలో వైద్యులు విడుదల చేశారు. జయలలితకు ఫిజియో థెరపీ చేయిస్తున్నామని వైద్యులు బులెటిన్ లో తెలిపారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్న ఆమెకు కొత్త కిట్ ను అమర్చామని, రెస్పిరేటరీ విధానంలో ఆమె శ్వాస తీసుకునేలా ఉంచామని అన్నారు. కాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ ఇంతకు క్రితం ఆసుపత్రికి వచ్చారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఈ రోజు మరో తమిళ నేత వైగో కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆమె కోలుకుంటున్న పరిస్థితుల్లో ఇన్ టర్మ్ సీఎం ను నియమించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.