: అమృత్సర్ లో తుప్పుపట్టిపోయిన బాంబులు స్వాధీనం
రోడ్డు పక్కన దూరంగా పడి ఉన్న ఓ బ్యాగ్ గురించి సమాచారం అందుకున్న పోలీసులకు, ఆ బ్యాగులో తుప్పుపట్టి ఉన్న బాంబులు కనిపించాయి. ఈ ఘటన అమృత్సర్ సమీపంలోని ఛెహెర్ట రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఆ బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో మొత్తం 11 తుప్పు బాంబులు లభించినట్లు మీడియాకు చెప్పారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.