: మరో సర్జికల్ దాడికి సిద్ధమవుతున్న భారత్?


ఇప్పటికే పీఓకేలో సర్జికల్ దాడులు నిర్వహించి పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన భారత్... మరోసారి అదే తరహా దాడులకు సిద్ధమవుతోందా? సరిహద్దులోని పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. సరిహద్దుకు అవతల ఉన్న గ్రామాల్లోని ప్రజలను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. భారత్ ఏ క్షణంలో అయినా మరోసారి సర్జికల్ దాడులకు దిగే అవకాశం ఉందన్న అనుమానంతోనే పాక్ ఈ చర్యలు చేపట్టింది. భారత్ చేపట్టే సర్జికల్ దాడులను ఈ సారి సమర్థవంతంగా ఎదుర్కోవాలని పాక్ సైన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. మరోవైపు, పాక్ సైన్యం చేపట్టిన పనిని భారత సైన్యం, నిఘావర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.

  • Loading...

More Telugu News