: ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్ష భగ్నం.. బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న కొత్త జిల్లాలలో భాగంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆయన వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలపడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన చేస్తోన్న దీక్షను పోలీసులు ఈరోజు ఉదయం భగ్నం చేశారు. దీక్షాస్థలి నుంచి రాజయ్యను పోలీసులు బలవంతంగా ఏరియా ఆసుపత్రికి తరలించారు.