: జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నై వెళ్లనున్న మోదీ.. ‘జయ బెహన్’ ఆరోగ్యంపై ప్రధాని ఆందోళన


అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు ప్రధాని మోదీ నేడు చెన్నై రానున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. జయకు చికిత్స చేసేందుకు విదేశాల నుంచి వైద్యులు రావాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆమె ఆరోగ్యంపై మోదీ ఆందోళన చెందారు. జయలలిత ఆరోగ్యంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొనడంతో అసలేం జరుగుతోందంటూ ప్రధాని కార్యాలయం రాజ్ భవన్ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకుంది. తమిళనాడు సీఎంను జయ బెహన్ అని ప్రేమగా పిలిచే ప్రధాని ఆమె అనారోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ఆయన నేరుగా చెన్నై చేరుకుని జయను పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News