: సీసీ కెమెరాకి చిక్కిన ఆత్మ... ఆత్మలున్నాయనడానికి సాక్ష్యమంటున్న నెటిజన్లు!


ఆత్మలున్నాయా? ఇది అనాదిగా మనిషిని వెంటాడుతున్న ప్రశ్న. మరణం తరువాత ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. మరణం తరువాత ఆత్మలు స్వర్గం లేదా నరకానికి చేరుతాయని మత గ్రంధాలు స్పష్టం చేస్తే... హేతువాదులు మాత్రం అలాంటివేవీ లేవని, స్వర్గమైనా నరకమైనా జీవించి ఉన్నంతవరకేనని పేర్కొంటూ ఉంటారు. ఆత్మల గురించిన క్లారిటీ లేని ప్రస్తుత తరుణంలో సీసీ పుటేజ్ కు చిక్కిన ఓ వీడియో యూ ట్యూబ్ లో సంచలనం రేపుతూ వైరల్ గా మారింది. నెమ్మదిగా రోడ్డు దాటుతున్న ఓ కారును వేగంగా వచ్చిన ఓ బైకర్ ఢీ కొట్టాడు. ఈ బైకర్ నేరుగా ఓ స్తంభాన్ని గుద్దుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూసిన పలువురు పరుగుపరుగున అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తిలోని ఆత్మ లేచి బయటకు వెళ్ళినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 2,50,000 మంది వీక్షించగా, వేల సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ఫేక్ వీడియో అంటూ దీనిని కొట్టిపడేస్తున్నారు. గ్రాఫిక్స్ సాయంతో దీనిని తయారు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News