: శ్రీవారి గరుడ సేవకు లక్షల సంఖ్యలో పోటెత్తిన భక్తులు.. తోపులాట
అంగరంగ వైభవంగా జరుగుతోన్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంలో వేంకటేశ్వరుడు విహరించనున్న విషయం తెలిసిందే. శ్రీవారికి చేసే గరుడసేవను చూసేందుకు లక్షల సంఖ్యలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరింపజేశారు. అయినప్పటికీ, కొద్దిసేపటి క్రితం వెంగమాంబ అన్నదాన సత్రం ప్రవేశద్వారం వద్ద తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఆస్థాన మండపం, వసంత మండపం, వరాహస్వామి గెస్ట్ హౌజల వద్ద భారీగా భక్తులు ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.